Wednesday, 29 July 2026 01:46:34 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

స‌జావుగా ఏపీపీఎస్సీ ప‌రీక్ష‌ల నిర్వహణ..! అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పూర్తి ఏర్పాట్లు

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 10 February 2026 09:14 AM Views : 197

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ).. నాలుగు నోటిఫికేష‌న్ల‌కు సంబంధించి నిర్వహిస్తున్న ప‌రీక్ష‌లు స‌జావుగా జ‌రుగుతున్నాయ‌ని, అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ తెలిపారు. సోమ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. న‌గ‌రంలోని సీవీఆర్ బాలిక‌ల న‌గ‌ర‌పాల‌క సంస్థ ఉన్న‌త పాఠ‌శాల ప‌రీక్షా కేంద్రాన్ని సంద‌ర్శించారు. అభ్య‌ర్థులు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప‌రీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ అట‌వీ, ఎండోమెంట్ శాఖ‌ల‌కు సంబంధించి వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ఏపీపీఎస్సీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంద‌ని, ఇవి ఈ నెల 13వ తేదీ వ‌ర‌కు జ‌రుగుతాయ‌న్నారు. విజ‌య‌వాడ‌, ప‌రిస‌ర ప్రాంతాల్లోని 15 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని.. సీటింగ్ అరేంజ్‌మెంట్‌, ఫ‌ర్నిచ‌ర్‌, తాగునీరు, మ‌రుగుదొడ్లు, విద్యుత్ స‌ర‌ఫ‌రా ఇలా వివిధ అంశాల్లో ఎక్క‌డా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామ‌న్నారు. లైజ‌నింగ్‌, చీఫ్ సూప‌రింటెండెంట్లతో పాటు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు స‌మ‌ష్టి కృషితో ప‌రీక్ష‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ఆదేశాలిచ్చామ‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు దిశానిర్దేశం చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, పూర్తి భద్రత మ‌ధ్య పరీక్షలు రాసేలా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :