Monday, 14 September 2026 02:37:21 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

అభివృద్ధి కావాలంటే హస్తం గుర్తుకే ఓటెయ్యాలి...! మంథని పట్టణాన్ని రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

Date : 05 February 2026 12:33 AM Views : 269

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇప్పటికే మంథని మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, రానున్న రోజుల్లో మంథని పట్టణాన్ని రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం మంథని పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజల విశ్వాసం, ఆశీర్వాదాలతో మంథని పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని, మంథని మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులకు సంబంధించి మైనార్టీ, మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు. మంథని మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా పరిమిషన్ లో గాని ప్రజాలకు అందాల్సిన పథకాల విషయంలో ఎలాంటి అవినీతి జరగకుండా పారదర్శకంగా ముందు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. మంథని పట్టణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రహదారులు, పరిపాలన, విద్య, వైద్యం, పట్టణ సౌకర్యాలు వంటి అన్ని రంగాలు సమగ్రంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించారని, వాటిని ఆచరణలో పెడుతున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ సంక్షేమం అర్హుల దరి చేరలేదని, ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనత ముమ్మాటికీ బిఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. ఇప్పుడు తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇచ్చి ఆకలి తీర్చామన్నారు. మేము ఇచ్చిన గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రెండు లక్షల రుణమాఫీ, మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు, అనారోగ్య బాధితులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంపు లాంటి హామీలను నెరవేరుస్తున్నామన్నారు. అభివృద్ధి కావాలంటే హస్తం గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :