ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : Lరాష్ట్రంలో భానుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి మూడో వారానికే ఎండలు మండుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటేశాయని, గురువారం నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా నిజామాబా ద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉం టుందని, ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
Admin
E Nivas News