ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న మహబూబాబాద్ మాజీ సర్పంచ్ భూక్య నెహ్రూ నాయక్ ను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుని త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. నెహ్రూ నాయక్ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ యువ నాయకులు గుగులోత్ శ్రీరామ్ నాయక్, గుగులోత్ రఘురాం తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News