ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అటవీ భూములను సాగు చేసుకుని బ్రతికితేనే కొనసాగి జీవనం మాది.. అలాంటిది అట్టి భూములను మీరు రాకుంటే మేము బ్రతకాలా చావాలా మీరే చెప్పండి అంటూ ఆదివాసీలు అటవీకే అటవీశాఖ అధికారులను నిలదీసినవైన మీది... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో మల్లి పోడు వివాదం రగిలింది. గురువారం పులస గ్రామ శివారులోని అటవీ భూమిని జేసీబీతో చదును చేసుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులు పోడు రైతులు అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు పోడు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమ తాతా ముత్తాతల నుంచి ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, హక్కు పత్రాలు కూడా ఉన్నాయని, ఇప్పుడు వచ్చి మా భూములు లాక్కుంటే మేము మా పిల్లలు ఎట్లా బతకాలని ఫారెస్ట్ అధికారులను నిలదీశారు. ఉన్న ఈ భూములను లాక్కుంటే ఉపాధి కోల్పోయి కుటుంబాలతో రోడ్డున పడుతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అరెస్టు చేసి కేసు పెట్టిన, చంపిన మా సాగు భూములను వదులుకోబోమని పోడు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు తమ పరిస్థితిని గమనించి ఆదుకోవాలని ముక్తకంఠంతో ఆదివాసీలు వేడుకుంటున్నారు.
Admin
E Nivas News