Saturday, 12 September 2026 09:25:05 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ఏఎన్ఎంలపై ఆన్లైన్ పని భారం తగ్గించాలి.. ఏఎన్ఎంలకు సూపర్ వైజర్ ప్రమోషన్ ఇవ్వాలి...

వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కు వినతి...

Date : 03 September 2026 08:51 PM Views : 63

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ కుఏఎన్ఎంలు ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న 15 డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు . ఈ సందర్బంగా తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) జిల్లా కార్యదర్శి మౌలాలి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు అందరు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు, ప్రధానంగా అధిక లక్ష్యాలు విధించడం, ఆ లక్ష్యాలను ప్రతివారం,ప్రతి నెల అధిగమించాలని తీవ్రమైన ఒత్తిడి, ఏక కాలంలో ఆఫ్ లైన్, ఆన్ లైన్ నమోదు చేయాలని చెప్పడం మూలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యానికి గురి అవుతున్నారు, కావున పని ఒత్తిడిని తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నా మన్నారు. రెగ్యులర్ ఏ.ఎన్.ఎంలకు సంబంధించి ఎల్.హెచ్.వి ట్రైనింగ్ పూర్తి కాలేదని 12,18 సంవత్సరాల స్పెషల్ ప్రమోషనల్ పోస్ట్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయడం లేదన్నారు.ఫలితంగా ఏఎన్ఎంలు ఆర్థికంగా చాలా నష్టపోతున్నా రన్నారు. కావున గతంలో మాదిరిగా ప్రభుత్వ ఖర్చుతో ఎల్.హెచ్. వి ట్రైనింగ్ ఇప్పిం చాల న్నారు .ట్రైనింగ్ ఇచ్చేలోపు పెండింగ్ లో ఉన్న ఇంక్రిమెంట్స్ విడుదల చేయాలన్నారు. అదేవిధంగా అర్హులైన ఏ.ఎన్.ఎంలకు సూపర్వైజర్ ప్రమోషన్స్ కల్పించాలి.గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న 1931 ఏపీ హెచ్ఎ ఫిమేల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయాలి, రెగ్యులర్ అయి మిగిలి పోయిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఏ.ఎన్.ఎం. లందరికి వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించి, రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఇప్పించాలన్నారు. ప్రధానంగా ప్రతి పనికి ఆభా లింకింగ్ వలన అనేక సమస్యలు ఎదురవుతున్నాయి, ఈ ఆభా లింకింగ్ విధానాన్ని తీసివేయాలి. జీతంతో కూడిన ఎఫ్ టీఏ ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి ఏఎన్ఎం లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి తగిన సూచనలు పంపించి మాకు న్యాయం చేయగలరు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎన్ఎంలు పద్మావతి, మంగు భాయి, వసంత, విజయదర్షిన్, కృష్ణవేణి యేసు వర, సుజాత, నరసమ్మ, మీనా తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :