Sunday, 13 September 2026 11:58:28 PM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

బిజెపి నిర్లక్ష్యమేతో బీసీ వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం

Date : 11 October 2025 07:51 PM Views : 270

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బిజెపి ప్రభుత్వ కుట్రతోనే బీసీ వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఎం నాయకులు ఆరోపించారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి, చెన్నూర్ మండల కార్యదర్శి బోడంకి చెందులు మాట్లాడుతూ కేంద్రంలోనీ బిజెపి ప్రభుత్వం కుత్రతోనే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ల అమలుకై అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర గవర్నర్,రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం మూలంగానే బీసీలు రిజర్వేషన్లు పొందలేకపోతున్నారన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధిని బిజెపి అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధత రాకపోవడానికి బిజెపి కారణమన్నారు. దీని మూలంగా రాష్ట్ర హైకోర్టు ఎన్నికల పైన స్టే విధించడం జరిగిందన్నారు. ఒకవైపు బీసీల కోసం పనిచేస్తున్నామని చెప్పుతూ మరోవైపు బీసీల ఎదుగుదలను ఓర్వ లేకుండా బిల్లును అడ్డుకోవడం దుర్మార్గమైన విషయం అని ఆరోపించారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉండి కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. బిజెపి ఎంపీ,ఎమ్మెల్యేలకు మోడీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్లు అమలు చెయ్యకుండ బిజెపి దొంగ నాటకాలడుతుందన్నారు. దిన మూలంగానే బీసీలు అన్యాయానికి గురౌవుతున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకై సంఘాలు,మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు కేంద్రంపై పోరాటం చేయాలని ఈ సందర్భంగా సిపిఎం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో శామల ఉమారాణి, కుందారపు చంద్రన్న, భోగే నాగజ్యోతి, బొండ్ల సరిత, సిడం సమ్మక్క, బోయిరే రమాదేవి, కరీంభీ, గట్టక్క, బొందయ్య, బానయ్య తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :