Monday, 02 March 2026 04:58:07 PM
# మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం... # విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం... # రక్తం దానం చేసిన కాంగ్రెస్ యువ నాయకుడు బీరెల్లి రజిని కుమార్ # మాదిగ అమరవీరులకు ఘన నివాళులు # బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి # భూపాలపల్లి పట్టణ అభివృ ద్ధికి సమగ్ర చర్యలు తీసు కోవాలి # దొంగ నోట్ల చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ తెలంగాణ చీఫ్ బ్యూరో # ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్... # జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ... # సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ # ఘనంగా అయిదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు.. # విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. # నకిలీ గోల్డ్ బి స్కెట్లు ఇచ్చి.. కిలో అసలుతో బంగారు నగలు తో పరారీ... # ప్రతాపసింగారంలో స్పాట్‌లైట్ క్రికెట్ మైదానం ప్రారంభించిన మంత్రి జీ. వివేక్... # రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విద్యా కమిషన్ నివేదిక # మార్చిలో 18 రోజులు బ్యాంకులు బంద్.. # 103 కిలోల బరువున్నా మహిళకు విజయవంతమైన శస్త్ర చికిత్స # జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై హైకోర్టులో విచారణ.. ఏప్రిల్30 వరకు గడువు పొడిగింపు.. # గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి... # పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వరంలా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం...

నిర్మల్ జిల్లా పోలీసు విభాగానికి మరో శక్తివంతమైన ట్రాకింగ్ సహాయకురాలు యామి

Date : 20 February 2026 06:04 AM Views : 71

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : “యామి” అనే పోలీసు జాగిలం 8 నెలల పాటు ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ) లో ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని నిన్న నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ లో ఉత్తీర్ణత సాధించింది. నిర్మల్ జిల్లాలో ట్రాకింగ్ విభాగంలో విధులు నిర్వహించేందుకు ఇది సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నేడు యామి తన హ్యాండ్లర్లతో కలిసి నిర్మల్ జిల్లా పోలీసు అధికారి డా.జి.జానకి షర్మిల మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. అధికారిని కలిసిన సందర్భంగా జాగిల శిక్షణ, సామర్థ్యం, భవిష్యత్తులో నిర్వహించనున్న విధులపై వివరాలు తెలియజేశారు. యామి అనే జాగిలం ట్రాకర్ కేటగిరీకి చెందిన బెల్జియం మలియానైజ్ బ్రీడ్ కు చెందింది. ఈ బ్రీడ్ తన చురుకుదనం, గమనించే శక్తి, వాసన గుర్తించే సామర్థ్యం, నేర అన్వేషణలో ఖచ్చితత్వం వంటి లక్షణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేర పరిశోధనలు, మిస్సింగ్ కేసులు, ట్రాకింగ్ ఆపరేషన్లు వంటి కీలక సందర్భాల్లో ఇది పోలీసు విభాగానికి ఎంతో తోడ్పడనుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిలయామి సేవలను ప్రశంసిస్తూ, ప్రజల భద్రత, నేరాల ఛేదనలో ఈ ట్రాకర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పోలీసు విభాగంలో ఆధునిక విధానాలు, శాస్త్రీయ అన్వేషణ పద్ధతుల వినియోగానికి ఇది మరొక అడుగు అని పేర్కొన్నారు. హ్యాండ్లర్స్, వారు అందుకున్న ప్రశంసా పత్రాలతో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిలనుమర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.యామిని శిక్షణతో తీర్చిదిద్దిన హ్యాండ్లర్లు జి.పరమేశ్వర్ మరియు ఎం.సాగర్ ఈ శునకంతో కలిసి విధులు నిర్వహించనున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :