Tuesday, 15 September 2026 09:12:48 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఫిబ్రవరి 12న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

టి యు సి ఐ జిల్లా అధ్యక్షుడు గోగర్ల తిరుపతి

Date : 10 February 2026 08:27 AM Views : 232

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని టి యు సి ఏ జిల్లా అధ్యక్షుడు గోవర్ల తిరుపతి కోరారు. సోమవారం కొమరం భీమ్ జిల్లా రెబ్బెన మండలo లోని శ్రీ కన్యకా కాటన్ మిల్లు (ఎక్స్ రోడ్) లో ఏర్పాటు చేసినకార్యక్రమం లో టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు గోగర్ల తిరుపతి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వo తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం - 2025, విబి జి -రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ ఐ సి లో 100%విదేశీ పెట్టు బడులను అనుమతించడం లాంటి ప్రమాద కరనిర్ణయాలను ఉపసంహారించాలని, కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని, కార్మికుల్ని నిరాయుధులను చేసి పెట్టుబడి దారులు, పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్లకు బంగారు పళ్లెంలోపెట్టిబహుమానం ఇచ్చేందుకు సిద్దమైం దన్నారు. అందులో భాగంగానే విరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించు కున్న 29కార్మిక చట్టాలను రద్దు చేసిందని, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్ లను 6సంవత్సరాల క్రితం (2019-2020) సంవత్సరాలలో తెచ్చిం దన్నారు. వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడిన ఫలితంగా ఇంతకాలం వాటిని అమలు చేయకుండా ఆపగలి గా మన్నారు. కానీ నేడు మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలుతో కార్పొరేట్ సంస్థ ల సులభతర వ్యాపారానికి ద్వారాలు తెరిచింది. కార్పొరేట్ల ప్రయోజనాలు, వారి లాభాలు పెంచేందుకు 2025నవంబర్ 21న లేబర్ కోడ్స్ అమలుకు నోటిఫికేషన్ జారీ అయిందన్నారు. 2025 శీతకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసే సమయం లో హడావిడిగా మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ నోటిఫై చేసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి వి బి జి--రామ్ జి స్కీమ్ ను రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపింది. విద్యుత్ సవరణ బిల్లు 2025,విత్తన సవరణ చట్టం, ఇన్సూరెన్స్ రంగంలో 100%విదేశీ పెట్టుబడులకు అనుమతి లాంటి మరిన్ని వినాశకరమైన చట్టాలను, బిల్లులను తీసుకొచ్చి శ్రమజీవులపై దాడి చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరంగా ఉన్న శ్రామిక వర్గాలను చావు దెబ్బ కొట్టిం దన్నారు. కేంద్ర ప్రభుత్వం 4లేబర్ కోడ్ ల అమలుతో 40కోట్ల సంఘటిత, ఆసంఘటీత కార్మికులు, వారి కుటుంబాలు చితికి పోయేలా, కార్పొరేట్లు లాభాలు ప్రొగేసుకోడానికి మార్గం సుగమం చేసింది. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని కార్మిక చట్టాలనునియంతృత్వ, దౌర్జన్యపూరితంగా కేంద్ర ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకోని మర్చి వేసిం దండాలు.ఇది రాజ్యాంగం లోని ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతిసే రాజ్యాంగ వ్యతిరేక చర్య, అంతర్జాతీయ కార్మిక సంస్థ ""ఐ ఎల్ ఓ ""సిఫారసులను పూచిక పుల్లల తీసి పరేషారు. బ్రిటిష్ ప్రభుత్వం తో పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం 1926 ప్రకారం యూనియన్ల ఏర్పాటు కార్మిక హక్కుగా పొందారు. కానీ ఈ లేబర్ కోడ్ లతో కార్మికులు సంఘం పెట్టె హక్కు, సంఘాటీతమయ్యే హక్కు నిరసనలు, సమ్మె చేసే హక్కులపై ఉక్కు పాదం మోపారు. ఉద్యోగ భద్రత పట్ల యాజమాన్యా ల కున్న అన్ని బాధ్యతలను తొలగించారు. హైర్ & ఫైర్ పద్ధతిని తీసుకొచ్చి పర్మినెంట్ ఉద్యోగాలకు మంగళం పాడారు. కోర్ యాక్టివిటీలో సైతం విచ్చలవిడిగా కాంట్రాక్ట్ కార్మికులను నియమించుకోవడం చట్ట పరం చేశారు. ఫిక్స్ డ్ టర్మ్ ఉపాధిని శాశ్వతం చేసింది. ఈ విధానం వల్ల పెట్టు బడి దారులకు అనేక రేట్లు లాభాలు పెంచుకొనేందుకు అవకాశం కల్పించింది. కార్మికుల రిక్రూట్ మెంట్, లే ఆఫ్ లకు 100 మంది కార్మికులు పనిచేసే పరిశ్రమ యాజమాన్యం ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనే నిబందనను ఎత్తివేసి 300 లకు పెంచారు. లేబర్ అధికారుల కోరలు పికి ఫెసిలిటేటర్ గా మార్చి వారిని మధ్యవర్తులుగా రాయబారాలు చేసే అనామకులుగా నిర్ణయించారు. లేబర్ కోర్ట్ లను రద్దు చేసి వాటి స్థానం లో పారిశ్రామిక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులు అమలు కాకుండా ఉండేందుకు అపరిమిత మైన అధికారాలు ఆయా ప్రభుత్వాలకు కట్ట బెట్టారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత నుండి యాజమాన్యాలు చట్టభద్ధంగా తప్పించుకునేందుకు పలు మార్గాలను సృష్టించారు. కనీస వేతనాలకు బదులుగా ఫ్లోర్ లెవెల్ కనీస వేతనం అమలు చేయ నున్నట్లు లేబర్ కోడ్ లలో పేర్కొన్నారు. కనీస వేతనాల నిర్ణయానికి ఇప్పటివరకు ఉన్న డా. అక్ట్రా యిడ్ సిఫారసులు,1957 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులు, 1992 నాటి రేప్టా కోస్ బ్రేట్ కేసులో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పులకు తిలోదాకాలిచ్చారు. ఈ కోడ్ లో కనీస వేతన నిర్వచనమే లేదు, వేతనాలు ఎలా నిర్ణయిస్తారో తెలియదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేషనల్ ఫ్లోర్ లెవల్ వేతనం రోజుకు రూ,178, నెల వేతనం రూ 4,628లకు తక్కువ కాకుండా ఏ రాష్ట్రం లో ఇవ్వకూడదంటున్నారు. ఇదే అమలైతే ప్రస్తుతం కార్మికులు అదనంగా పొందే వేతనాల్లో భారీ కోతలు తప్పవు. కార్మికులు జీవించడమే గగనంగా మారిందన్నారు. ఎన్ని పని గంటలు ఉండాలో, ఎప్పుడు విరామం ఉండాలో, ఎంత స్ప్రెడ్ ఓవర్ టైం ఉండాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. మేడే స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినం యొక్క పోరాట స్ఫూర్తి ని నేటి కార్మిక వర్గానికి తెలియకుండా చేసే ప్రయత్నాలకు పూనుకున్నా రన్నారు. మన రాష్ట్రం తో పాటు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పని దినాన్ని 10,గంటలకు స్ప్రెడ్ ఓవర్ టైం ను 12 గంటలకు పెంచుతు చట్ట సవరణలు చేశారు. ఈ లేబర్ కోడ్ లు ఈ ఎస్ ఐ, పి ఎఫ్, గ్రాట్యుటి, పెన్షన్ మరియు ప్రసూతి ప్రయోజనాల వంటి అన్ని ప్రయోజనాలను మింగేస్తాయి. ఇవి అమలైతే అధిక శాతం కార్మికులకు చట్ట పరంగా సామాజిక భద్రత పరిధి నుండి గెంటి వేయబడతారు. లేబర్ కోడ్ ల వల్ల ఆసంఘాటీతరంగ కార్మికులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని మోడీ ప్రభుత్వం అబద్దపు ప్రచారం చేస్తుందన్నారు. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు పని భద్రత, పి ఎఫ్, ఈ ఎస్ ఐ, వెల్ఫేర్ బోర్డ్ లో పేర్కొన్న పథకాలు ఎలా లభిస్తాయనే అంశంలో లేబర్ కోడ్స్ లో నిర్థిష్టమైన ప్రస్తావన లేదు. అలాగే అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐ కె పి, వి ఓ ఏ, ఆర్ పి, ఉపాధి హామీ, నేషనల్ హెల్త్ మిషన్, లాంటి స్కిములలో పని చేస్తున్న వారిని కనీసం కార్మికులుగా కూడా గుర్తించ లేదన్నారు.కార్పొరేట్ యజమానులు కార్మికుల శ్రమను, దేశ సంపదను యాదేచ్చగా దోచు కునేందుకు బానిసత్వం లోకి నెట్టెందుకే ఈ 4లేబర్ కోడ్ లు దోహదం చేస్తాయన్నారు.కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ఉపసoహరించుకునేలా కార్మిక వర్గం ప్రతి ఘటనకు పునుకోవాలి. లేబర్ కోడ్స్ రాద్దయ్యే వరకు ఐక్యంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిస్తున్నాము. ఈ కార్యక్రమం లో కార్మికులు శనిచర్ చౌదరి, అనిల్, వినోద్, బంభం, అమరజిత్, వకీల్, రాంలాల్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: