Sunday, 13 September 2026 12:58:55 AM
# దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్

కెసిఆర్ రాకతో మళ్లీ పూర్వ వైభవం రానుందా...

గులాబీమయమైన జగిత్యాల

Date : 19 April 2026 11:01 PM Views : 205

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టానికి జగిత్యాల వేదిక కాబోతుంది. రేపు జగిత్యాల పట్టణంలో నిర్వహిస్తున్న బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్న ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ శ్రేణులు తమ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పట్టణమంతా గులాబీ తోరణాలతో పాటు ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఈ సభకు నేరుగా మాజీ ముఖ్యమంత్రి రావడం వల్ల అధికారులు ప్రత్యేకమైన భద్రతను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి, సీనియర్‌ నాయకుడు జీవన్‌రెడ్డి,పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు పార్టీ ఫిరాయింపుదారులకు అందలం ఎక్కిస్తూ కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన నాయకులు,కార్యకర్తలను చిన్నచూపు చూడడాన్ని నిరసిస్తూ ఇటీ వలే కాంగ్రెస్‌ను వీడడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తర్వాత బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి జీవన్‌ రెడ్డి సమ్మతిని తెలియజేశారు. కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ చేరేందుకు సిద్ధమయ్యారు. సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటు న్న వివిధ సమస్యలపై సమరశంఖం పూరిస్తూ జీవన్‌రెడ్డిని తమతో కలు పుకొని కాంగ్రెస్‌పై యుద్ధం చేసేందుకు ఈ నెల 20న జగిత్యాలలో భారీ బహి రంగ సభను నిర్వహించా లని వారం క్రితమే నిర్ణయిం చగా అప్ప టి నుంచే అందరి చూపూ సభపైనే నెలకొన్నది. కేసీఆర్‌ ప్రసంగంపైనే ఆసక్తి జగిత్యాల జిల్లాలోని 20 మండలాల పరిధిలోని గులాబీ శ్రేణులు పల్లెలు పట్నాల్లోని గడప గడపకూ కలియదిరుగుతూ, సభకు పెద్ద సంఖ్యలో తరలిరావా లని విజయవంతం చేయాల నికోరుతున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావి స్తూ, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ లను తుంగలో తొక్కిందని మళ్లీ పోరాటం చేస్తేనే తెచ్చుకున్న తెలంగాణలో తిరిగి బాగు పడుతామని, అందుకు జగిత్యాల సభతో నే నాంది పడుతుందని, గులాబీ పెద్దలు ప్రచారం చేస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :