ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : వాహనదారులు నిబంధన లకు విరుద్దంగా వాహనం నడుపుకుంటూ వెళ్తే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తుంటారని కాగాఆ చలాన్లను మనకు వీలున్న ప్పుడు చెల్లించుకునే అవకాశం ఉండేదని మరీ ఎక్కువ చలాన్లు పడితే వాహనాలను ట్రాఫిక్ పోలీ సులు సీజ్ చేసేవారన్నారు.త్వరలో చలాన్ల వసూళ్ల విషయంలో కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విధానం ద్వారా మీ వాహనంపై చలాన్ పడిన కొద్దిసేపటికే మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయని తెలిపారు. హైదరాబాద్ యూసుఫ్ గూడలో సోమవారం సాయంత్రం అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథి గా పాల్గొని మాట్లాడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన దారులపై కఠినంగా వ్యవ హరించాలని అధికారులను ఆదేశించారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటు ఆందోళనకరంగా ఉందని, దీనికి మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నపడం వంటి ప్రధాన కార ణాలు అని పేర్కొన్నారు. ఇదే సమయంలో పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి, ఓ ప్రతిపాదన చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వాహనాలు నడిపిన వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లపై ఇకపై ఎలాంటి రాయితీలు, డిస్కౌంట్లు ఉండవని రేవంత్ స్పష్టం చేశారు. చలాన్ పడిన వెంటనే వాహనదారుడి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు. ఇందుకోసం వాహనం రిజిస్ట్రేషన్సమయంలోనే యాజమాని బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయాలని రేవంత్ సూచించారు. ఏదైనా నిబంధన అతిక్రమించి చలాన్ పడితే జరిమానా మొత్తం నేరుగా బ్యాంకు ఖాతా నుండి కట్ అయ్యేలా సాంకేతికతను తీసుకురావాలని, ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు.ట్రాఫిక్ క్రమశిక్షణ అనేది పాఠశాల దశ నుంచే అలవడాలని. విద్యార్థుల సిలబస్‌లో రోడ్డు భద్రత అంశాలను చేర్చాలని విద్యాశాఖకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రవాణా, పోలీస్ శాఖలు సమన్వ యంతో పనిచేసినప్పుడే రోడ్డు ప్రమాద రహిత తెలం గాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రోడ్డు భద్రత విభాగంలో పనిచేయడాన్ని శిక్షగా భావించే ధోరణిని మార్చాలని సీఎం రేవంత్ అన్నారు. ఇకపై ఈ విభాగా నికి డీజీ లేదా అడిషనల్ డీజీ స్థాయి అధికారులను నియమించిఈ రంగాన్ని హైడ్రా లేదా సైబర్ క్రైమ్ విభాగాల తరహాలో శక్తివంతంగా మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరిపోవని, మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన రవాణా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News