ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలం గాణ రాష్ట్రంలో ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి.రైతు బంధు నిధులు విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం కాటారం రైతు వేదికలో ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల. వ్యవసాయ అధికారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులు రైతుబంధు నిధుల విడుదలపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రైతుబంధు నిధులు 3000. కోట్లు విడుదల చేయడం ప ట్ల సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేట నర్మెట్లలో ఆయి ల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభాన్ని, నిధుల విడుదల కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షించి స్వాగతించారు. ఈ సందర్భంగా ఏం.సీ.చైర్ పర్సన్. పంతకాని తిరుమల, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంగోతు సుగుణ.పలు వురు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన రైతు సంక్షేమ అభివృద్ధికి కోట్లాది రూపాయలు నిధులు వెచ్చిస్తూ రైతును రాజు చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. మన ప్రాంతంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మినీ కాళే శ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు, తాగు నీరందించడానికి నిధులు విడుదల చేయడం సంతోష కరమన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రెటరీ కుంభం స్వప్న, డిసిసి వైస్ ప్రెసిడెంట్ గద్దె సమ్మిరెడ్డి, ప్రచార కమిటీ చైర్మ న్ కుంభం రమేష్, వార్డు సభ్యులు కుర్ర శ్రీకాంత్ బోడు సడవల్లి, మాజీ ఉపసర్పం చ్ శ్రీనివాస్.తో పాటు రైతు లు పాల్గొన్నారు.
Admin
E Nivas News