ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న సిద్దిపేట జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టు బిహెచ్కె. కె.సి.ఆర్ నగర్ లో ప్రత్యేక అవగాహనకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ దుర్గ మాట్లాడుతూ మహిళలు వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉండకుండా షీ టీమ్‌ను సంప్రదించాలని కోరారు. షీ టీమ్ పనిచేస్తుం దని , ఆపదలో ఉన్నవారికి అండగాఉంటుందనీ వివరించారు. మహిళల భద్రత షీ టీం లక్ష్యమన్నారు. ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, సైబర్ బుల్లీయింగ్ మరియు మానవ అక్రమ రవాణాపై అప్రమత్తత, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, చైల్డ్ అబ్యూజ్ మరియు 'గుడ్ టచ్ - బాడ్ టచ్' పట్ల అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు మరియు టి సేఫ్ - యాప్ యొక్క ప్రాముఖ్యత తెలియజేశారు. ఎక్కడైనా, ఎప్పుడైనా వేధింపులు ఎదురైతే భయపడకుండా వెంటనే డైల్ 100 లేదా సిద్దిపేట షీ టీమ్ నంబర్ 8712667434 కు సమాచారం అందించాలన్నారు. బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని ఇన్స్పెక్ దుర్గా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్ఐ కిషన్ పవార్, ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ రజిని, మమత, మరియు పోలీస్ కానిస్టేబుల్స్ లక్ష్మీనారాయణ, ప్రవీణ్ తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News