Monday, 14 September 2026 08:04:44 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

సిపిఐ పొత్తును కాంగ్రెస్ విమర్శించడం వారి విజ్ఞతకే నిదర్శనం

సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్

Date : 01 December 2025 08:28 PM Views : 262

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : సిపిఐ పొత్తును కాంగ్రెస్ విస్మరించడం వారి విజ్ఞతకే నిదర్శనమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ సీపీఐ స్థానాల్లో పోటీ చేయడం న్యాయం కాదని, కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలిపారు . సోమవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్ధతు ఇచ్చిందన్నారు. కానీ నేటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ కి సహకరించి పొత్తు ధర్మాన్ని పాటిస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ నేడు అభ్యర్థులను పోటీలో నిలిపి ద్వంద నీతిని ప్రదర్శించడం అన్యాయమన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజా పోరాటాల ద్వారా పలు రకాల సమస్యలకు పరిష్కారం చూపుతున్న సీపీఐ పొత్తును కాంగ్రెస్ నాయకులు విస్మరించడం వారి అహంకార ధోరణికి నిదర్శనం అని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని 118 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు సీపీఐ మద్ధతు ఇచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు. అంతేకాకుండా ప్రజలు జరుగుతున్న అన్ని రకాల పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారని తెలిపారు. అంతకుముందు దౌడపల్లి సర్పంచ్ అభ్యర్థి మేదరి దేవవరం మాట్లాడుతూ తాను సర్పంచ్ పోటీలో లేనంటూ అసత్య ప్రచారం చేస్తూ సీపీఐ ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తన నిస్వార్ధ సేవలను, ప్రజలకు అందుబాటులో ఉంటే విధానాన్ని బట్టి న్యాయంగా ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు.ప్రజా క్షేత్రం లో తనకు ఆదరణ ఉందని, ఇండిపెండెంట్ వార్డ్ అభ్యర్థులు కూడా తనకు మద్ధతుగా ఉన్నారని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి, జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న, ఏఐటీయూసీ నాయకులు రమణ రెడ్డి,నాయకులు దేవయ్య, మధుకర్, దేవేందర్, సత్తన్న, శాంతయ్య, శ్రీదేవి, విజయలక్ష్మి, శంకరయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :