ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చేసిన అభివృద్ధి పనులు బీజేపీ నాయకులకు కనిపించడం లేదా..? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు ప్రశ్నించారు. సోమవారం పట్టణంలోని ఐబీ విశ్రాంత భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్య రామమందిరం నిర్మాణంలో జరిగిన అవినీతి బీజేపీ నాయకులగొప్పతనాన్ని సూచిస్తుందన్నారు. వాట్సాప్ యూనివర్సిటీ, అంధ భక్తులు బీజేపీ నాయకులుగా చలామణిఅవుతున్నారని ఏద్దేవా చేశారు. దేశంలో చదువు, భక్తి, ఐక్యత ఉన్నచోట బీజేపీ అధికారంలో లేదని వివరించారు.గత 30 ఏండ్లుగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి బీజేపీ నాయకులకు కనిపించడం లేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను అజ్ఞానంలో ఉంచి రాజ్యమేలాలని చూస్తోందన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కోట్ల నిధులు వెచ్చించి రోడ్లు,మౌళికసదుపాయాలు ఏర్పాటు చేసిన ఘనత దివాకర్ రావుదేనని గుర్తు చేశారు. జిల్లా ఏర్పాటు,మెడికల్ కాలేజ్ లాంటి నిర్మాణాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అని వివరించారు. అంతకుముందు మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్లు మాట్లాడుతూ ఎరువులు ధరలు పెంచి రైతుల నడ్డి విరిచింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. 25 ఏండ్ల కిందటి పరిస్థితిని మరచిపోయి మాట్లాడటం బీజేపీ నాయకునికే చెల్లుతుందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్లు తిప్పని లింగన్న, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ తిరుపతి, నాయకులు పురుషోత్తం, చాంద్, ప్రభాకర్, బాపు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News