Sunday, 13 September 2026 01:53:38 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

నూతన ఆవిష్కరణ లకు ప్రభుత్వ ప్రోత్సాహం

ఐటి శాఖ డి.శ్రీధర్ బాబు

Date : 12 November 2025 11:09 PM Views : 204

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : నూతన ఆవిష్కరణ లకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. బుధవారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి మంథని డ్రీమ్ స్టార్ట్ కార్యాలయంలో టీ వర్క్స్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు ఆధునిక సాంకేతిక సంబంధించిన మైండ్ సెట్ మేకర్ పుస్తకాన్ని ఆవిష్కరించి, ఇంగ్లీష్ టు తెలుగు పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించిన విధంగా పిల్లలు మంచి కలలు కని, వాటిని సాధించేందుకు కార్యాచరణ ప్రారంభించాలని మంత్రి సూచించారు. పిల్లల ఆలోచనలను పదును పెట్టేందుకు డ్రీమ్, స్టార్ట్, రైస్ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. మంథని లోని యువకులు నూతనంగా తయారు చేసిన వ్యవసాయ పవర్ ఫిడర్, ఆధునిక హెల్మెట్ తయారి వంటి ఆవిష్కరణలు చేసేందుకు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మంథని లో టీ వర్క్స్ ఆధ్వర్యంలో డ్రీమ్, స్టార్ట్, రైస్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యం వెలికి తీయడానికి ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తుందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న 20 పాఠశాలల్లో డ్రీమ్, స్టార్ట్, రైస్ సంస్థ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. డ్రీమ్, స్టార్ట్, రైస్ సంస్థ కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొంటున్న విద్యార్థులకు హైదరాబాద్ లోనే టీ వర్క్ సందర్శనకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు. అనంతరం మంథని పట్టణంలోని పోచమ్మ వాడలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులకు తూకంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని, 48 గంటలో బ్యాంకు ఖాతాలలో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. మంథని జూనియర్ కళాశాలల ఆవరణలో 44 లక్షలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీ వర్క్స్ సీఈఓ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్, ఆర్.డి.ఓ. సురేష్, తహసిల్దార్, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: