ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా డిసిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పిన్నింటి రఘునాథరెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు శనివారం సాయంత్రం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. రామకృష్ణాపూర్ కు చెందిన రఘునాథరెడ్డి కాంగ్రెస్ జిల్లా, రాష్ట్రస్థాయిలో అనేక పదవుల్లో పనిచేసిన అనుభవం ఉంది. రఘునాథ్ రెడ్డి డిసిసి అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Admin
E Nivas News