Friday, 11 September 2026 07:39:28 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఎమ్మెల్సీలంతా పార్టీలైన్‌కు కట్టుబడి ఉండాలి... ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

Date : 08 September 2026 10:03 PM Views : 33

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ శాసనమండలి సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్సీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. పార్టీ విప్ దేశపతి శ్రీనివాస్ పేరుతో ఈ మేరకు మంగళవారం లేఖ విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే శాసనమండలి సమావేశానికి పార్టీకి చెందినఎమ్మెల్సీలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని విప్‌లో స్పష్టం చేశారు. సమావేశం ప్రారంభమైన తర్వాత సభ వాయిదా పడే వరకు రోజంతా మండలిలోనేఉండాలనిp ఆదేశించారు. అలాగే సభలో జరిగే చర్చల్లోసభ్యులందరూ పార్టీ ఆదేశాలకు నిర్ణయాలకుఅనుగుణంగా పాల్గొనాలని సూచించారు. ఏ అంశంపై చర్చ జరిగినా పార్టీవైఖరికిఅనుగుణంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎమ్మెల్సీలకు ముందుగానే స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ సభా వ్యవహారాల్లో పార్టీ నిర్ణయాన్ని పక్కాగా పాటించాలని సూచించింది.ఇక శాసనమండలిలో జరిగే ఏ బిల్లుతీర్మానం లేదా ఓటింగ్‌లోనైనా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలందరూ పార్టీ వైఖరికి అనుకూలంగా ఓటు వేయాలని మూడు లైన్ల విప్‌లో స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించడానికి ఎలాంటి అవకాశం లేదని బీఆర్ఎస్ తేల్చిచెప్పింది. విప్‌ను పాటించడంలో ఏ సభ్యుడైనా విఫలమైతే దాన్ని పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తామని హెచ్చరించింది. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లోని ఫిరాయింపుల నిరోధక చట్టం.. అలాగే శాసనమండలి నియమ నిబంధనల ప్రకారం సంబంధిత సభ్యుడిపై అనర్హత వేటు వేసే ప్రక్రియను ప్రారంభిస్తామని విప్‌లో పేర్కొన్నారు. దీంతో శాసనమండలి సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సభలో కీలక బిల్లులు, తీర్మానాలు, ఓటింగ్ అంశాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ జారీ చేసిన ఈ మూడు లైన్ల విప్ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :