ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమరం భీమ్ఆసిఫాబాద్ మండలం బూరుగుడ గ్రామంలో ఉత్సాహంగా జరిగిన 3రోజుల క్రికెట్ పోటీలు శనివారంతో ముగిశాయి. ఈ టోర్నమెంట్‌లో చైతన్య డిగ్రీ కాలేజ్ జట్టు ప్రథమ బహుమతిని గేలుచుకోగా, మాతృశ్రీ డిగ్రీ కాలేజ్ జట్టు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకుంది. విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం సేయింట్ జాన్స్ స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, సేయింట్ జాన్స్ స్కూల్ కరస్పాండెంట్ భూష్ణం నిస్సార్, ఇమ్రాన్ మరియు మాజీ సర్పంచ్ బలరాం నాయక్ పాల్గొని, విజేత జట్లకు బహుమతులు అందజేసి అభినందించారు.
Admin
E Nivas News