Tuesday, 15 September 2026 06:16:36 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

చిన్నారుల ఆరోగ్య సంరక్షణతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యం..

ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ప్రారంభం

Date : 13 July 2026 10:38 PM Views : 95

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : చిన్న వయస్సు నుంచే పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు.సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బ్రాహ్మణవాడలోని స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగావిద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసి, ఈ బృహత్తర కార్యక్రమాన్నిఅధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల్లో నులిపురుగుల సమస్య వల్ల రక్తహీనత, తీవ్ర పోషకాహార లోపం ఏర్పడి, వారి శారీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నులిపురుగుల నిర్మూలనతోనే పిల్లలు ఆరోగ్యంగా,ఉత్సాహంగా ఎదుగుతారని పేర్కొన్నారు.జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలందరికీ వంద శాతం మాత్రలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ,విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు వసతి ద్వారాను పిల్లలకు ఆల్బజండాల్ మాత్రలు వైద్య సిబ్బంది వేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసం.. అనంతరం,పాఠశాల ప్రాంగణంలో చిన్నారి విద్యార్థులకు కలెక్టర్ స్వయంగాఅక్షరాభ్యాసం చేయించారు. పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించి, విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టారు. చిన్నతనం నుంచే పిల్లలకు మంచి విద్యతో పాటు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడం మన అందరి బాధ్యత అనిగుర్తుచేశారు. అనంతరంఎస్.ఐ.ఆర్.ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫారాలను త్వరతితగిన స్వీకరించి డిజిటలిజేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని బి.ఎల్.ఓ, సూపర్వైజర్లను ఆదేశించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటి నీరు పోశారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి మాధవి,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సాధన, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గణేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి వై.సి.శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అపర్ణ, స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :