Saturday, 12 September 2026 11:13:17 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

జనసంద్రంగా మారిన తెలంగాణ కుంభమేళ..

వన దేవతలను దర్శించుకుంటున్న లక్షలాది మంది భక్తులు

Date : 30 January 2026 11:11 PM Views : 194

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆసియాలోనే తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన ఆదివాసీల ఆరాధ్య దైవమైన వనదేవతల దర్శనానికి మూడవ రోజైన శుక్రవారం నాడు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. దర్శనం చేసుకుని నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. అలాగే చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నతాధికారులు కూడా వచ్చి వనదేవతలను దర్శనం చేసుకుని పునీతులయ్యారు. ఇప్పటికీ తాడ్వాయి నుండి మేడారం వరకు రహదారులన్నీ భక్తులు వచ్చిపోయేవాహనాలతో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పోలీస్ యంత్రాంగం అక్కడికి చేరుకొని ట్రాఫిక్ సమస్యను కంట్రోల్ చేస్తున్నారు. భారీగా పోటెత్తిన భక్తజన సందోహం కు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఆదివాసీల జాతర గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా అరణ్యంలో జరుగుతుంది. ఇప్పటికీ భక్తులు రాకపోకలు సాగిస్తున్న రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. భక్తులకు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు వీఐపీలకు ప్రత్యేక దారిని ఏర్పాటు చేసి అక్కడి నుండే వెళ్లి మొక్కులు చెల్లించుకుని మళ్ళీ అదే దారి నుండి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల నుండి మేడారంలో బస్సు చేసిన భక్తులు అమ్మవార్ల దర్శనం అనంతరం తిరిగి వెళ్తున్నారు. శనివారంతో తిరిగి వనదేవతలు కన్నేపల్లికి సారలమ్మ, చిలకలగుట్టకు సమ్మక్క, అలాగే పగిడిగిద్ద రాజు కూడా వనప్రవేశాలు సాయంత్రం చేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్యగంటగంటకి పెరుగుతోంది. మంత్రి సీతక్క జాతర ఆరంభ నుండి అక్కడే ఉంటూ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేస్తున్నారు. మరోవైపు మేడారంలో ఏర్పాటు చేసిన చిరు దుకాణాల్లో వ్యాపారులు భక్తుల వద్ద నిలువు దోపిడీ చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. చాలామంది భక్తులు వారికి తెలియక ఏమి అవసరమైన సామాన్లు కూడా తీసుకువెళ్లకపోవడంతో అక్కడ దొరికే వస్తువులకు అన్నిటికీ రూపాయి విలువ చేసే వస్తువుకు పది రూపాయలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బెల్లం బంగారాన్ని కూడా భారీగా భక్తులు కొనుగోలు చేస్తున్నారు. ఏది ఏమైనా భక్తులు చేసేది లేక కొనుక్కోనిది వెళ్ళదు కాబట్టి తీసుకోవడం జరుగుతుందన్నారు. బయటికి ఎటు వెళ్ళాలన్నా గంటల సమయం పడుతుందని అందుకోసం వెళ్లలేక తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమైన వస్తువులన్నీ కొనుగోలు చేస్తున్నామని అన్నారు. సేఫ్టీ అధికారులు సైతం పలు హోటళ్లలో వంటనూనె, చిప్స్ పాకెట్లు, కూల్ డ్రింక్స్ తదితర వాటిని పరీక్షిస్తున్నారు. కాలం చెల్లిన వస్తువులను తీసుకెళ్తున్నారు. పోలీస్ యంత్రాంగం భారీ భద్రత నడుమ భక్తులు వనదేవతలను దర్శించుకొని మూడు రోజుల నుండి ఉన్నవాళ్లు ఇళ్లకు తిరిగి వెళ్ళిపోతున్నారు. శనివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే మినీ మేడారం జాతరలలో కూడా నాకు వేల సంఖ్యలో భక్తుల ధరలు వచ్చి వనదేవతలను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: