Friday, 11 September 2026 10:18:36 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

19 న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్‌ విజయవంతం చేయండి..

పోలీస్ రిక్రూట్ మెంట్ లో ఆదివాసిలకు జరిగిన అన్యాయంపై నిరసన..

Date : 17 August 2026 09:57 PM Views : 99

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ కేంద్ర, రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు 19 న చేపట్టనున్న ఏజెన్సీ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆదివాసి నాయకులు, విద్యార్థులు, యువత, వ్యాపారులు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఏజెన్సీ ప్రాంత ఆదివాసి అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏజెన్సీ ప్రాంత యువతకు పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో 75 శాతం రిజర్వేషన్‌తో ప్రత్యేక అవకాశాలు కల్పించేవారని, తద్వారా ఏజెన్సీ ప్రాంత ఆదివాసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేవని అన్నారు. అయితే ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంత అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా సాధారణ విధానంలో నియామకాలు చేపట్టడం వల్ల ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వేలాది మంది ఆదివాసి యువత ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్యా, ఆర్థిక, ఉపాధి పరంగా ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఆదివాసి యువతకు ఉన్న ప్రత్యేక అవకాశాలను కూడా తొలగించడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంత యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి, పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో గతంలో అమలులో ఉన్న 75 శాతం ప్రత్యేక రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక నిబంధనలు అమలు చేయాలని, ఆదివాసి యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా ఏజెన్సీ ప్రాంత ఆదివాసి యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని మండలాల్లోని ఆదివాసి యువత, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగార్థులు, సామాజిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు మరియు వివిధ వర్గాల ప్రజలు ఐక్యంగా నిలిచి బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా వాణిజ్య, వ్యాపార సంస్థల యజమానులు, మార్కెట్ వ్యాపారులు స్వచ్ఛందంగా తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేసి ఏజెన్సీ బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మధురాజ్ మడావి మాట్లాడుతూ ఇది కేవలం ఒక ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, ఏజెన్సీ ప్రాంత ఆదివాసి యువత భవిష్యత్తు, ఉద్యోగ హక్కులు మరియు ప్రత్యేక హక్కులకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. అందువల్ల ప్రతి ఆదివాసి యువకుడు, విద్యార్థి మరియు ప్రజలు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “ఆదివాసి యువత ఉద్యోగ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి – 75% ప్రత్యేక రిజర్వేషన్‌ను పునరుద్ధరించి, ఏజెన్సీ బంద్‌ను విజయవంతం చేయాలి” అని నాయకులు పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంత హక్కులు, ఆదివాసి యువత భవిష్యత్తు మరియు ఉద్యోగ అవకాశాల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ బంద్‌కు ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ముఖ్య సలహాదారు డాక్టర్ కనక ప్రభాకర్, తుడుందేబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతీ, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సెడ్మాకి తుకారాం, తుడుందేబ్బ జిల్లా ఉపాధ్యక్షులు కోట్నక రాంశవ్, మడపచి భీంరావు, తుడుందేబ్బ జిల్లా కార్యదర్శి సిడాం నాగేష్, మరియు తుడుందేబ్బ నాయకులు, విద్యార్థి సంఘం జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :