ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రతి ఆలయంలో ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం ద్వారానే దేవుళ్లను దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం నాలుగు గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఆలయ సిబ్బంది తెలిపారు. వచ్చిన భక్తులకు అన్ని రకాల ఏర్పాటు చేశామని చెప్పారు. రెండవ అన్నవరం గా పేరు గాంచిన గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవుడి ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక వసతులు కల్పించడం జరిగిందని ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ జగిత్యాల మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల నుండి ప్రత్యేక బస్సులు కూడా నడుస్తాయని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం సోమవారంరాత్రి నుండి భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు చేరుకుంటున్నారు. అంతేకాకుండా చాలామంది భక్తులు ప్రముఖ దేవాలయాల కూడా తరలి వెళ్లారు.
Admin
E Nivas News