ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రజలే దేవుళ్ళు ప్రజలే పాలకులు అనే నినాదంతో వస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజిని యాదవ్ పిలుపుమేరకు రాష్ట్ర కార్యదర్శి ఎండీ అఖిల్ పాషా, రాష్ట్ర నాయకుడు గుండవేన స్వామి యాదవ్,ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు కాసిపేట ఉదయ్ కుమార్ పెద్దపెల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. బీసీలకు అన్యాయం చేస్తున్న అగ్రవర్ణాల పార్టీల అహంకార అధికారాన్ని కత్తిరించేందుకు, దేశంలో మొదటి సారిగా కనివిని ఎరుగని మ్యానిఫెస్టో తో ప్రజలే దేవుళ్ళు, ప్రజలే పాలకులు అనే నినాదంతో ప్రతి ఒక్క పౌరునికి జవాబు దారితనంతో కూడిన పాలన అందివ్వాలని దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుతో మి ముందుకు వస్తుందని, బీసీల హక్కుల కోసం బీసీల రాజ్యం కోసం బిసి ఎస్సి ఎస్టి మైనారిటీల ఆశావహులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ బి ఫామ్ లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కాసిపేట ఉదయ్ తెలిపారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం, మంథని ఆశావహులు నుండి జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తుందని, వాటిని పూర్తిచేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి బరిలో నిలవాలని పిలుపునిచ్చారు. పెద్దపెల్లి జిల్లాలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం జరిగిందని, మున్సిపల్ పోరులో నిలిచే ఆశావహులు సంప్రదిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గం, మండల నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News