Sunday, 13 September 2026 12:15:53 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

షహీద్ భగత్ సింగ్ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలి...

మంచిర్యాల లో భగత్ సింగ్ సంస్మరణ సభ..

Date : 23 March 2026 10:03 PM Views : 205

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భరతమాత దాస్య విముక్తి కోసం పోరాడి ఉరికంబాన్ని ముద్దాడిన షహీద్ భగత్ సింగ్ స్ఫూర్తితో దేశ ప్రజలు సమస్యల సాధన కోసం ఉద్యమించాలని వివిధ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. షహీద్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవుల 95 వ అమరత్వ దినం సందర్భంగా సోమవారం మంచిర్యాలలో ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో వారు పాల్గొని ప్రసంగించారు. కుల మత సంకుచిత ధోరణులను అధిగమించిన నాటి వీరులు స్వాతంత్ర్య పోరాటంలో ఐక్యంగా పాల్గొన్నారని వారు తెలిపారు. నేటి కాలంలో ప్రజలు మత సామరస్యతను, జాతి సమైక్యతనుకాపాడాలని పిలుపునిచ్చారు. "సామ్రాజ్యవాద్ ముర్దాబాద్" అంటూ నేటికీ వందేళ్ల క్రితమే షహీద్ భగత్ సింగ్ నినదించాడని వారు తెలిపారు. ఆయా స్వతంత్ర దేశాలలోకి చొరబడి దేశాధినేతలను రాక్షసంగా హతమార్చే జులుంను ప్రదర్శిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే వారికి భగత్ సింగ్ స్ఫూర్తిగా నిలిచాడని వారు పేర్కొన్నారు. దేశంలోని సామాన్య ప్రజలకు ఆకలి, పీడనల నుండి విముక్తి లభించడమే నిజమైన స్వాతంత్ర్యమని షహీద్ భగత్ సింగ్ పేర్కొన్నాడని వారు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై పోరాడే వారికి తరగని స్ఫూర్తి ప్రదాతగా షహీద్ భగత్ సింగ్ నిలిచి ఉంటాడని తెలిపారు. భగత్ సింగ్ పుట్టిన గడ్డపై ఆయన ఆశయాలకు మరణం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షహీద్ భగత్ సింగ్ స్మారక సమితి కన్వీనర్ అలుగూరి కైలాసం, సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు సంకె రవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్, బీమా ఉద్యోగుల సంఘం నాయకులు మోతే రామదాసు, ఏ తిరుపతిరెడ్డి, క్యాతం రవి, నేదునూరు కిరణ్, తూముల మల్లేష్, అన్నం రమేష్ కట్టా ప్రకాష్, కుక్కుడపు బాపు, గుమాస ప్రకాష్, వేముల అశోక్, తోట గౌరయ్య, ప్రేమ్ కుమార్, రవూఫ్ మిడివెల్లి రాజ్ కుమార్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: