ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని వడ్డేపల్లి గార్డెన్ లో మంగళవారం డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్డీఓ దత్తారావు, పిఎసీఎస్ చైర్మన్ అలీ బిన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ స్వయం సహాయక గ్రూపు మహిళలు ఇవ్వాళ దేశానికే కాకుండా ప్రపంచానికి తలమానికంగా తయారయ్యారని అన్నారు. 98 శాతం లోను రికవరీ రేటుతో అప్రతిహతంగా దూసుకుపోతున్నారని తెలిపారు. మహిళలు తమ కాళ్ళ మీద నిలబడి కుటుంబ పోషణతో పాటు వ్యాపారాలు చేసుకుని స్వయం సమృద్ధి దిశగా ప్రయాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.
Admin
E Nivas News