ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : సిఐటియు ఆధ్వర్యంలో మంథని మునిసిపల్ కార్మికులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు . ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ కార్మికులకు ఉరి తాళ్లుగా మారిన 4 లేబర్ కోడ్స్ అమలుకై బిజెపి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని ఈ నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మున్సిపల్ కార్మికులందరినీ ఆన్లైన్ పోర్టల్ లో పేర్లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంథని మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ కార్మికులను కాంటాక్ట్ పద్ధతిలో విలీనం చేయాలని ఈ మధ్యకాలంలో తీసుకున్న కార్మికులను కాంట్రాక్టు లోకి మార్చాలని మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సబ్బులు నూనెలు చెప్పులు బట్టల కుట్టుకూలీ డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మల్లేష్, చందు, గట్టయ్య, రాజయ్య, జంపయ్య, రాజేష్, భాగ్య, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News