Tuesday, 28 July 2026 07:14:25 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

*పరీక్షల భయం నుంచి విజయం వైపు పయనం*

Date : 23 February 2026 10:30 AM Views : 678

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విద్యార్థి జీవితంలో పరీక్షలు ఒక మైలురాయి. అయితే చాలామందికి పరీక్షలంటే భయం, ఆందోళన, ఒత్తిడి అనే భావాలు ముందుకొస్తాయి. ఈ భయం సహజమే అయినప్పటికీ, దాన్ని అధిగమించి విజయానికి దారితీసే మార్గాన్ని అవగాహన చేసుకోవడం అత్యంత అవసరం. సరైన దృక్పథం, ప్రణాళిక, సాధన ఉంటే పరీక్షలు భయంకరమైనవి కాదు. అవి మన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు. *పరీక్షల భయం అంటే ఏమిటి?* పరీక్షల ముందు కలిగే ఉద్రిక్తత, నెర్వస్‌గా ఉండటం, నేను రాయలేను, ఫెయిల్ అయితే?” అనే ఆలోచనలు ఇవన్నీ పరీక్ష భయం లక్షణాలు. ఇది ముఖ్యంగా మూడు కారణాల వల్ల వస్తుంది. 1.అతిగా ఆశలు పెట్టుకోవడం 2.సరైన ప్రణాళిక లేకపోవడం 3.తులనాత్మక ఒత్తిడి 4.ఇతరులతో పోల్చుకోవడం జరుగుతుంది. *పరీక్షల భయానికి ప్రధాన కారణాలు సిద్ధత లోపం* పాఠ్యాంశాన్ని పూర్తిగా చదవకపోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. విఫలమవుతాననే భయం, ఒక పరీక్షే జీవితాన్ని నిర్ణయిస్తుందని భావించడం,తల్లిదండ్రులు మరియు సమాజ ఒత్తిడి, "మొదటి ర్యాంక్ రావాలి" వంటి ఒత్తిడి విద్యార్థిని ఆందోళనకు గురిచేస్తుంది. గత అనుభవాలు మునుపటి పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం వల్ల భయం పెరుగుతుంది. *పరీక్ష భయాన్ని జయించే మార్గాలు,సరైన ప్రణాళిక* రోజువారీ చదువు షెడ్యూల్ తయారు చేయాలి. కఠినమైన అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. చిన్న లక్ష్యాలు పెట్టుకుని సాధించాలి. *పునరావృతం* చదివిన విషయాలను తిరిగి చదవడం, ముఖ్యమైన పాయింట్లను నోట్స్‌గా తయారు చేయడం,మాక్ టెస్టులు రాయడం,ధనాత్మక ఆలోచనలు, "నేను చేయగలను" అనే నమ్మకం పెంచుకోవాలి. ఇతరులతో పోల్చుకోకుండా స్వీయ ప్రగతిపై దృష్టి పెట్టాలి. *ఆరోగ్యంపై శ్రద్ధ* తగిన నిద్ర 7 నుండి 8 గంటలు ఉండేలా చూసుకోవాలి. పోషకాహారం, వ్యాయామం లేదా యోగా సమయ నిర్వహణ, చివరి నిమిషం చదువును నివారించాలి. పరీక్ష సమయంలో సమయాన్ని సరిగా పంచుకోవాలి. *పరీక్షల సమయంలో పాటించాల్సిన చిట్కాలు* ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదవాలి. సులభమైన ప్రశ్నలతో ప్రారంభించాలి. సమయాన్ని గమనిస్తూ రాయాలి. చివరలో సమాధానాలను పరిశీలించాలి. *తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర* తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తగ్గించాలి. ప్రోత్సాహం ఇవ్వాలి. మార్కులకంటే శ్రమను మెచ్చుకోవాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి. పరీక్షను భయంగా కాకుండా అవకాశంగా చూపాలి. *విజయం అంటే మార్కులే కాదు* విజయం అనేది కేవలం మార్కులు కాదు.పరీక్షలు మనలో ఉన్న లక్షణాలు. 1.క్రమశిక్షణ 2.పట్టుదల 3.సమయపాలన 4.ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలను అభివృద్ధి చేస్తాయి. పరీక్షల భయం సహజమైనదే కానీ అది మన లక్ష్యాలను అడ్డుకోవద్దు. సరైన ప్రణాళిక, ధైర్యం, కృషి ఉంటే భయం విజయంగా మారుతుంది. పరీక్షను శత్రువుగా కాకుండా స్నేహితుడిగా చూడగలిగితే ప్రతి విద్యార్థి తన జీవితంలో విజయాన్ని సాధించగలడు. "భయం ఒక భావన మాత్రమే, విజయం ఒక నిర్ణయం". "మీరు భయాన్ని కాదు,విజయాన్ని ఎంచుకోండి". ---డా.ఓర్సు రాయలింగు 9849446027

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :