ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నవోదయ విద్యాలయాలు భవిష్యత్తుకు మార్గదర్శకాలని విద్యార్థులంతా శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో రాణించాలన్నారు. బుధవారం కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో నిర్వహించిన 39వ నవోదయ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ శ్రీ దండే విఠల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగాఎమ్మెల్సీ మాట్లాడుతూ నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలనుఅధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్సీ దండే విఠలని శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News