ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎప్పుడు ఏదో ఇష్ట రజంగా మాట్లాడుతూ వివాదం సృష్టించడానికి కేరాఫ్‌గా మారుతున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వీర్లపల్లి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వీర్లపల్లి వ్యాఖ్యలపై ముఖ్యంగా బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే ప్రాతనిధ్యం వహిస్తున్న షాద్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వీర్లపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ స్థానికంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. నేడు కేసీఆర్ పై.. గతంలో వెలమలపై.. లగచర్ల ఘటన నేపథ్యంలో వీర్లపల్లి శంకర్ గతంలో కల్వకుంట్ల కుటుంబం లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో సంబంధిత వీడియో వైరల్ కావడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వెలమ సామాజికవర్గానికి వ్యతిరేకంగా ఉన్నాయనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. దీన్ని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ తీవ్రంగా ఖండించగా.. దోమలగూడ పీఎస్‌లో ఎమ్మెల్యే శంకర్ పై ఫిర్యాదు కూడా చేశారు. వెలమ సామాజికవర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావని వీర్లపల్లి శంకర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా చ్చుకుంటే వాటిని ఉప సంహరించుకుంటున్నట్లు అప్పట్లో ప్రకటించారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనుచితంగా ప్రవర్తించారంటూ వీర్లపల్లితో పాటు మరికొందరిపై బీఆర్‌ఎస్ ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు కూడా చేసింది. తాజాగావీర్లపల్లి శంకర్ కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. 'కేసీఆర్ చనిపోవాలని తాము కోరుకుంటున్నామని, అవసరమైతే ఆయన ఇంటి ముందు చావు డప్పు కొడతాం' అంటూ చేసిన వ్యాఖ్యలలు ప్రస్తుతం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనిపై బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీర్లపల్లిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బీఆర్‌ఎస్ జనరల్ సెక్రెటరీ ఆర్‌ఎస్.ప్రవీణ్ కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనలు తెలిపారు. పోలీసులకు సైతం ఫిర్యాదులు చేశారు. అధికార పార్టీకి తలప్పిగా 'వీర్లపల్లి' వ్యవహారం.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. బీఆర్‌ఎస్ వ్యూహాలకు ధీటుగా కాంగ్రెస్ ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్న తరుణంలో మాజీ సీఎంపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాజకీయ విమర్శల హద్దులు దాటి మాట్లాడడం అధికార పార్టీ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేశాల చేశాయి. వీర్లపల్లి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవా లేక కాంగ్రెస్ పార్టీ వైఖరీనా? అని బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. రెండు పార్టీల మధ్య తీవ్ర దుమారం రేగుతున్న తరుణంలో వీర్లపల్లి అనుచిత వ్యాఖ్యలు చేసి బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం ఇచ్చినట్లెందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కేసీఆర్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సిందని తాము ఎవరి చావునూ కోరుకోమని ఆయన మీడియాతో చిట్ చాట్ చేసిన సందర్భంగా వ్యాఖ్యానించారు. గతంలో వెలమ సామాజిక వర్గంపై వీర్లపల్లి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా టీపీసీసీ అప్పట్లో షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ తీసుకుంది. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ చేసి పార్టీని ఇరకాటంలో పెడుతుండడంతో పార్టీకి తలప్పి వ్యవహారంగా మారిందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ టీపీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. తరచుగా వివాదాల్లో చిక్కుకోవడం ఆయన సన్నిహితులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఎమ్మెల్యే సౌమ్యుడని, వివాదాలకు సైతం దూరంగా ఉంటారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష నేతలను విమర్శించబోయి తొందరలో మాట జారినట్లుగా చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ప్రస్తుతం వీర్లపల్లి శంకర్ చేసిన కామెంట్స్ ఎటు దారితీస్తాయోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
Admin
E Nivas News