ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట లో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం గుడిపేటలో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని ప్రజలకు మరింత వేగవంతమైన వైద్య సేవలను అందించేందుకు వైద్యులు,సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు 216 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఈ క్రమంలో భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.అనంతరం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా గుత్తేదారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News