Monday, 14 September 2026 02:12:35 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో భారీ ఫ్లాగ్ మార్చ్

పాల్గొన్న వంద మంది స్పెషల్ పార్టీ బలగాలు

Date : 10 February 2026 09:08 PM Views : 154

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పట్టణంలోని బొక్కలగూడ, అబ్దుల్లా చౌక్, ఖానాపూర్, అంబేద్కర్ నగర్, ప్రాంతంలలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో మంగళవారం విస్తృత ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్‌లో 100 మంది స్పెషల్ పార్టీ బలగాలు, పోలీసు సిబ్బంది పాల్గొని ప్రధాన వీధుల్లో మార్చ్ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. డబ్బు, మద్యం, బహుమతులు వంటి ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను విజయవంతం చేయడంలోపోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే సోషల్ మీడియా వేదికలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేయరాదని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎన్నికల సందర్భంగా ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించినా వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి మౌనిక ఐపిఎస్, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సిఐలు బి సునీల్ కుమార్, ఎం ప్రసాద్, ఎస్సైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :