ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నట్లుగానే బుధవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో పాటు ఏఐసీసీ సభ్యత్వానికి రాజీనామా చేసి జాతీయ అధ్యక్షుడు కర్గేకు లేఖ పంపించారు. తన 43 ఏళ్ల సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ ప్రయాణం నేటితో ముగిసింది. తాను ఉన్నంతకాలం ఎన్నో పదవులు చేపట్టి ప్రజాసేవ చేసిన మహనీయుడు. అలాంటి వ్యక్తిని ప్రస్తుతం ఉన్న నాయకత్వం చిన్నచూపు చూడడంతో మానసికంగా వేదనకు గురై రాజీనామా చేశారు. జీవన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలవగానే మరో 1500 మంది నాయకులు కార్యకర్తలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అంతేకాకుండా జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటికే రాజీనామా పర్వాలు కూడా మొదలయ్యాయి. మంత్రులు శ్రీధర్ బాబు అడ్డూరి లక్ష్మణ్ తో పాటు పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కూడా జీవన్ రెడ్డిని సముదాయించినా కూడా ఫలితం లేదు. తాను ఉన్నచోట మరొకరికి నాయకత్వం ఎలా అప్పచెప్పుతారని కరాకండిగా వారికి సమాధానం ఇవ్వడంతో వారు చేసేది లేక చెప్పడంతో చేసేదిలేక తిరిగి వెళ్లిపోయారు. రాష్ట్రంలో అంతకన్నా సీనియర్ నాయకులు లేరని తెలిసి కూడా అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఆయన కార్యకర్త లు సైతం ఆగ్రహంతో పట్టణంతోపాటు ఆయన ఇంట్లో గల ఫ్లెక్సీలను కూడా చింపివేశారు. కార్యకర్తల ఒత్తిడి తదితర కారణాల వల్ల వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వారు పార్టీలోనే ఉండాలని ఏఐసీసీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. రాజకీయ దిగజం జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారని పలువురు చర్చించుకుంటున్నారు.
Admin
E Nivas News