Saturday, 12 September 2026 01:49:50 AM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

నేరాల నియంత్రణకు ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలి

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

Date : 15 October 2025 07:34 PM Views : 320

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ నేరాల నియంత్రణకు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. సెప్టెంబర్ నెల నేర సమీక్షలో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్‌ అధికారులతో కమిషనరేట్‌లో సిపి బుధవారం నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించి కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పొలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేసుల పరిష్కార శాతం పెంచాలి, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ( యు ఐ & పి టి) కేసుల త్వరతగతిగన పరిష్కారించాలి. కేసుల దర్యాప్తులో విషయంలో అధికారులు ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీతో పాటు, శాస్త్రీయ పద్దతిను కూడా అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలి. గతం లో నమోదైన పెండింగ్ లో వున్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రధానంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు పారదర్శకంగా నిర్వహించి వేగవంతం చేయడంతో పాటు, నిందితులకు కోర్టులో శిక్షలు పడేవిధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టుకు అందజేయాలి. ఎస్సీ, ఎస్టీకేసు లలో, పోక్సో కేసు లలో బాధితులకు కంపన్సేషన్ త్వరగా అందేలా చూడాలి. కన్వెక్షన్ శాతాన్ని పెంచాలన్నారు.మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. మహిళలు, బాలికల, మైనర్ బాలుర మిస్సింగ్‌ కేసుల్లో అధికారులు వేగంగా స్పందించాలి, మిస్సింగ్ కేసుల చేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రాపర్టీ నేరాల ప్రత్యేక దృష్టి సారించి నేరాల నియంత్రణ కు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. నిందితుల పట్టుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి టీమ్స్ ఏర్పాటు చేయాలి.ప్రతి రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధగంట సమయం ప్రధాన చౌరస్తా, గ్రామాల వారిగా రోడ్ పై విషబుల్ గా ఉండాలి. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయడం వలన మీ మీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ ప్రసెన్స్ కనిపిస్తుంది. మీ గుర్తింపు, పోలీస్ శాఖ కీర్తి పెరుగుతుంది. ప్రజలకు పోలీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నది అనే నమ్మకం, భరోసా కలుగుతుందన్నారు.రోడ్డు ప్రమాదలలో ఎక్కువ శాతం యువత చనిపోవడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు సేఫ్టీ విభాగంతో కల్సి పనిచేయాలని, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేసి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలి. రోడ్ సేఫ్టీ వాలింటర్స్ ను తయారు చేయాలి అని ఆదేశించారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్స్ అనేది ఒక పెద్ద సమస్య. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం అవసరమని తెలిపారు. సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం బాధితులకు సకాలంలో సహాయం అందేలా చూడాలని సూచించారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని గంజాయి నియంత్రణ కు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేయాలి. గంజాయి, డ్రగ్స్ వంటి నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. అదేవిదంగా చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసిన ఎవరిని వదిలి పెట్టేది, ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ ప్రతిష్ట కు భంగం కలిగించే విధంగా విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని శాఖ పరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్‌ అధికారుల పనితీరుపైనే రామగుండము పోలీస్‌ కమిషనరేట్‌ కీర్తి ప్రతిష్టలు ఆధారపడి వుంటాయని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి ఎ .భాస్కర్ ఐపిఎస్., పెద్దపల్లి డిసిపి కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, సీసీ పిఎస్ ఏసీపీ రంగా రెడ్డి, సిసియస్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, కమీషనరేట్ పరిది ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్‌.ఐలు సీఐ లు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: