Sunday, 13 September 2026 01:59:56 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

హామీల అమలులో కాంగ్రెస్‌ పూర్తిగావిఫలం

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి

Date : 01 February 2026 11:14 PM Views : 159

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విచారణ పేరుతో ప్రతీకార రాజకీయాలకు తెర తీశారని మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి, మెదక్ ఎన్నికల ఇన్చార్జి,మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బిఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్‌ రెడ్డి డైవర్షన్‌ పోలిటిక్స్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగమే తల తోక లేని ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు అని పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు సిట్‌ పేరుతో నోటీసులు జారీ చేశారని తెలిపారు. చావు నోట్లో తలపేట్టి తెలంగాణ సాధించి,దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని అన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్ని విష రాజకీయాలు చేసినా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప నేత కేసీఆర్‌ అని స్పష్టంచేశారు. నోటీసులు, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్‌ను టచ్‌ చేస్తే తెలంగాణ అగ్ని గుండంలా మారి ఆ నిప్పుల సెగకు కాంగ్రెస్‌ పార్టీ మాడి మసైపోతుందన్నారు. కేసీఆర్ ఏ తప్పు చేయలేదని, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూడడంతో యూరియా దొరకని పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా జరగాలి, కానీ మెదక్లో బిఆర్ఎస్ నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మల్కాజిగిరి నుంచి గుండాలని రప్పించి వార్డులో ప్రచారం చేయిస్తూ మా పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య బద్దంగా, పక్షపాతం లేకుండా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ చూడాలని చెప్పారు. ఐదవ వార్డ్ లో మామిళ్ళ ఆంజనేయులు, నాయకులు శ్రీనివాస్ ప్రచారానికి వెళితే మల్కాజ్ గిరి నుంచి వచ్చిన గుండాలు కారులో వెంబడించి భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి. జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ. ఆంజనేయులు, నాయకులు జుబెర్ అహ్మద్, గౌస్ ఖురేషి, సున్నం నరేష్ శంకర్, మహిళా నాయకులరాలు రాధా తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: