ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి సోమవారం గడప గడపకు వెళ్లి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉత్సాహభరితంగా ప్రచారంచేశారు. బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కొరకై ప్రతీ గడప గడపకు ప్రచారం నిర్వహించి ఓటర్ మహాశయులను ఓటును అభ్యర్థించారు. ఈ సందర్బంగా స్కూల్ పిల్లలను బస్సులో వెళ్తుండగా వారికి అభివాదం తెలిపి 'ఇంట్లో అమ్మానాన్నకు కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ అభ్యర్థిని గెలించాలని' చెప్పమన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లితో తొర్రూరు మునిసిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, వార్డులవారిగా ఓటర్లు, యూత్ సోషల్ మీడియా నాయకులు పాల్గోన్నారు.
Admin
E Nivas News