Sunday, 21 June 2026 01:27:26 PM
# శ్రీ రామాలయ పునర్ ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు # 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Date : 15 June 2026 07:12 AM Views : 28

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సమయం ఉన్నప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటూ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగడ్డం వంశీకృష్ణ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలో పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఉదయం హైటెక్ సిటీలోని బ్యాడ్మింటన్ కోర్టులో యువతతో కలిసి బ్యాడ్మింటన్ ఆడి క్రీడల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం మంచిర్యాల బాయ్స్ గ్రౌండ్‌ను సందర్శించి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న చిన్నారులతో క్రికెట్ ఆడారు. మైదానం అభివృద్ధికి అవసరమైన చర్యలపై వెంటనే స్పందించిన ఎంపీ శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ తో ఫోన్‌లో మాట్లాడి గ్రౌండ్ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా 20 ట్రిప్పుల మట్టిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా చిన్నారుల క్రీడా ప్రోత్సాహం కోసం రెండు క్రికెట్ కిట్లను అందజేస్తానని హామీ ఇచ్చారు. క్రీడల ద్వారా యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలనిఆకాంక్షించారు. అనంతరంమార్కెట్ ప్రాంతంలోని రతన్ లాల్ హోటల్ వద్ద స్థానిక వ్యాపారులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, పార్కింగ్, తాగునీటి వంటి సమస్యలను ప్రజలు ఎంపీ దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా హోటల్ యజమానులు, వ్యాపారులతో మాట్లాడి వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సరఫరా సక్రమంగాజరుగుతుందా, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీమాట్లాడుతూప్రజల సమస్యలే నా సమస్యలు. ప్రజల మధ్యే ఉంటూ వారి అవసరాలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడం నా బాధ్యత” అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత, క్రీడాకారులు, వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: