ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిట్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, టీబీజీకేఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బాల్క సుమన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే మిర్యాల రాజీరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి సురేందర్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో కార్మికులు, టీబీజీకేఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్మికుల హక్కుల కోసం గళం విప్పారు. హామీలు అమలు చేసేంతవరకు ఎట్టి పరిస్థితులలో నిరసన కార్యక్రమాలు చేపడుతుంటామని హెచ్చరించారు.
Admin
E Nivas News