ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుందని కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలో బిసి బాలికల, కళాశాల మరియు వసతి గృహాలను కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం కోటపల్లి మండలంలోని కొల్లూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఇసుక రీచ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో ఉండేలా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. అలాగే ఇసుక రీచ్ లు కూడా స్థానికుల అవసరాలు తీర్చేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ రీచ్ ద్వారా తక్కువ ధరలకి గోదావరి ఇసుకను అందించడం జరుగుతుందన్నారు. ఎవరైనా అక్రమ ఇసుక దందాను చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమాలలో ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News