Sunday, 13 September 2026 12:52:54 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే ...

Date : 29 June 2026 09:41 PM Views : 95

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎస్ ఐ ఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సోమవారం బెల్లంపల్లి పట్టణంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ప్రక్రియ లక్ష్యం అని, ఎన్నికల జాబితాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. సోమవారం బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 31వ, 33వ వార్డుల్లో నిర్వహిస్తున్న ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఏలు, బీఎల్వోలతో కలిసి ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు కావాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా మిగిలిపోకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా ఈ ప్రక్రియకు పూర్తి సహకారం అందించి, అవసరమైన పత్రాలు సమర్పించి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుకు రావాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. ప్రతి బూత్ లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలంతో సమన్వయంతో పనిచేయాలని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో చేరవేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి రమేష్ బాబు , మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం సుకుమారి , బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు, బండి ప్రభాకర్ , కౌన్సిలర్లు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బి ఎల్ ఏ లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :