ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / సూర్యాపేట : సూర్యాపేట - జనగామ నేషనల్ హైవేపై నాగారం బంగ్లా సమీపంలో శనివారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. హైవేపై వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు పోలీసులపైకి దూసుకొచ్చి మరో బైక్ ను కూడా ఢీ కొట్టడంతో కానిస్టేబుల్ సహా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా వారిలో కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును స్పాట్ లోనే వదిలిపెట్టి పరారయ్యాడు. కారు నెంబర్ ఆధారంగా కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Admin
E Nivas News