ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని లోని కాకతీయ హై స్కూల్ లో శనివారం ఏర్పాటు చేసిన ఎస్.ఎల్.సి.(స్కూల్ లీడ్ కాన్ఫరెన్స్) కార్యక్రమంలో అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఎల్ కేజీ నుండి 5 తరగతి విద్యార్ధులు వివిధ రకాల ప్రాజెక్ట్ లతో ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలలో నైపుణ్యం గుర్తించి విద్యార్థులు స్వతహాగా వివిధ రకాల ప్రాజెక్ట్ తయారు చేయడం వారి నైపుణ్యతకు నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వివరంగా వివరించి చెప్పడం జరిగిందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు వారిలో దాగి ఉన్న నైపుణ్యతను గుర్తించడం కాకతీయ పాఠశాల యొక్క ప్రత్యేకతగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రవికిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, స్రవంతి రెడ్డి, పావని రెడ్డి,లీడ్ అకాడమిక్ అడ్వైజర్ అరుణ్, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News