ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : సంకటహర చతుర్థి పర్వదినమును పురస్కరించుకొని శనివారం గణనాథుడు ఘనంగా పూజలందుకున్నాడు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంకటాలు తొలగించే సంకటహర చతుర్థి దీక్షతో భక్తులు పునీతులవుతున్నారు. కార్తీక మాసంలో వచ్చిన సంకటహర చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులతో శ్రీ విఘ్నేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. ప్రతి నెలలో ఒకసారి వచ్చే సంకటహర చతుర్థి పర్వదినం రోజున మంథనిలోని శ్రీ మహాగణపతి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులు రాత్రి చంద్రోదయం అనంతరం 8.41 గంటలకు భోజనం చేస్తారు. మంథని పట్టణంలోని తమ్మిచెరువు కట్ట వీధిలో గల శ్రీ మహాగణపతి దేవాలయం ఎంతో విశిష్టత సంతరించుకుంది. కార్తీక మాసంలో వచ్చిన సంకట చతుర్థి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సంకటహర చతుర్థి పర్వదినం రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామి కి 121 మోదకుడు సమర్పించడం అలాగే దూర్వాలు సమర్పించడం ఎంతో శ్రేయస్కరం అని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా సంకటహర చతుర్థి రోజున మంథని పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అనేక రకాల పూలతో అలంకరించారు.
Admin
E Nivas News