Monday, 14 September 2026 07:14:29 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి

డీసీపీ.భాస్కర్

Date : 04 November 2025 08:56 PM Views : 288

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మంచిర్యాల డిసిపి ఎగ్గిడి భాస్కర్ తెలిపారు. లక్షెట్టిపేట పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని శ్రీనివాస గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమానికి డిసిపి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ పోలీసులు పనిచేస్తున్నది ప్రజల రక్షణ కోసమే అన్నారు. నిత్యం మన ప్రాంతాల్లో వాహనాలపై వెళ్తున్న వారు వివిధ ప్రమాదాలకు గురై చనిపోతున్నారని అలా వాళ్లు చనిపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ఇట్టి ప్రమాదాలకు కారణాలు కేవలం మనం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే అన్న విషయం మనం ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలని మనమే కాకుండా మన వాళ్లకు కూడా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన పెంచాలని అన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, పోలీసులు ప్రజల రక్షణ కోసం ప్రజల కుటుంబాల సంతోషం ఉండాలని ఎన్నో విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొన్ని ప్రమాదాల్లో గాయపడ్డ వాళ్లని చనిపోయిన వాళ్ళని చూస్తే మనసు చలించిపోతుందని అలాంటి ప్రమాదాలకు నిర్లక్ష్యం మనం రూల్స్ పాటించకపోవడం అన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్క డ్రైవర్ గాని ప్రతి ఒక్క వాహనదారుడు గాని తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. బైక్ నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని కారు నడిపి సమయంలో సీట్ బెల్ట్ ధరించాలని స్కూల్ పిల్లలను జాగ్రత్తగా డ్రైవర్లు తీసుకుపోవడం చేయాలని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని రాష్ డ్రైవింగ్ నేరంగా భావించాలని అవగాహన కల్పించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వాహన పత్రాలను సరిచూసుకోవాలని డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే వాహనం నడపరాదన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని వాహనదారులతో డ్రైవర్లతో ప్రమాణం చేయించారు. అనంతరం కొంతమందికి హెల్మెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి ప్రకాష్, సిఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్ ఎస్సై-2 రామయ్య, దండేపల్లి ఎస్సై తహసియుద్దీన్, జన్నారం ఎస్సై అనూష తోపాటు పోలీస్ సిబ్బంది, రవాణా శాఖ అధికారులు, వాహనదారులు డ్రైవర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: