ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శాంతియుతంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసుల దాడిని ఖండిస్తూ బుధవారం మంథని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ మరియు NTA నీ రద్దు చేయాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై విచక్షణ రహితంగా పోలీసుల దాడి చేయడాన్ని ఖండించారు. విద్యార్థులపై టి ఆర్ గ్యాస్ వాటర్ కెనాన్లు రబ్బర్ బుల్లెట్లు ఉపయోగిస్తూ అతి కిరాతకంగా ఉద్యమాన్ని అణిచివేయాలని చూడడం దారుణమైన చర్య అన్నారు. యువకులు విద్యార్థులు గత కొంతకాలం నుండి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రధాని మౌనంగా ఉండడం విడ్డూరంగా ఉందని ఎదేవ చేశారు. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్, నాయకులు అఖిల్,మహేందర్, రణధీర్ ,మనోజ్ ,సాయి కిరణ్, రామ్ చరణ్ ,తదితరులు పాల్గొన్నారు
Admin
E Nivas News