ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాదండేపల్లి మండలంలోని నాగసముద్రం గ్రామంలో ఇటీవల మృతి చెందిన దుర్గం పోషం, గూడ మల్లేష్ కుటుంబ సభ్యులను శనివారం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. వారి కుటుంబాల్లో చోటుచేసుకున్న విషాద ఘటనల పట్ల ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి, బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఎంపీ, ఈ కష్టకాలంలో తాము కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. ఎంపీ వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News