ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఆసిఫాబాద్ డిపో డ్రైవర్ రామారావు పైపెట్టిన కేసు,అలాగే బెల్ మంజూరు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా ఎస్పీ నితికా పంత్ కి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ మరియు కుటుంబ సభ్యులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, ఎఫ్ సి ఐ బోర్డ్ సభ్యులు పులగం తిరుపతి లు మాట్లాడుతూ ఆసిఫాబాద్ డిపో డ్రైవర్ పై పెట్టిన కేసును పునరాలోచించి వెంటనే ఎత్తివేయాలని అలాగే రామారావుకు బేషరతుగా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అలాగే ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రామారావు పై నాన్ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారని అన్నారు.ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వహించిన ఆసిఫాబాద్ డిపో మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆర్టీసీ కార్మికులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆర్టీసీ అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు.23 న రెబ్బెన మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సును వెనుక భాగంలో ఢీకొని బొలెరో డ్రైవర్ చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరి చిరంజీవి,టీ జి ఎస్ ఆర్ టి సి ( ఏఐటీయూసీ )డిపో అధ్యక్షుడుఅశోక్,కార్యదర్శి మోహన్ బాబు,రామారావు భార్య శారద వారి కుటుంబ సభ్యులు తో పాటు ఆర్టీసీ కార్మికులు ప్రవీణ్,గోపి కృష్ణ, తిరుపతి, రాజలింగ్, వెంకటేష్,విలాస్ తదితరులు నువ్వు ఉన్నారు .
Admin
E Nivas News