Monday, 14 September 2026 02:37:17 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి...

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 27 February 2026 07:41 AM Views : 224

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా,డి.సి.పి.ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు లతో కలిసి గోదావరి  పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ, పోలీస్,రెవెన్యూ, వైద్య, విద్యుత్, మత్స్య, నీటిపారుదల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు దక్షిణాది కుంభమేళా తరహాలో ఉంటాయని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గోదావరి నది పరివాహకంలో అనువైన ప్రాంతాలలో పుష్కరాల ఏర్పాట్ల కొరకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా జిల్లాలోని గోదావరి నది తీర ప్రాంతాలలో పుష్కర ఘాట్ల ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి కార్యచరణ సిద్ధం చేయాలని తెలిపారు. అధిక సంఖ్యలో మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరంలో పుష్కర స్నానాలు ఆచరిస్తారని, తరువాత గూడెంలో అధిక సంఖ్యలో భక్తులు పుష్కర స్థానాలకు హాజరవుతారని తెలిపారు. పార్కింగ్, హోల్డింగ్ ఏరియా,పండల్ ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, ప్రజా రవాణా వ్యవస్థ, డ్రోన్ ద్వారా పర్యవేక్షణ, పుష్కర ఘాట్ ప్రాంతాలలో లైటింగ్, త్రాగునీటి ఏర్పాట్లపై  ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని, ఈ విషయమై త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సమీక్ష ఉంటుందని తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ప్రతిపాదనలు, కార్యచరణ సిద్ధం చేసి అందించాలని తెలిపారు. పుష్కరాలలో భక్తుల సంఖ్య అంచనా ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని,ఈ క్రమంలో మంచిర్యాలలో 2 లక్షల మంది, వేలాలలో 50 వేల మంది, చెన్నూరు ప్రాంతంలో సైతం అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. నీటిపారుదల శాఖ నివేదిక ఆధారంగా నూతన ఘాట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వెలుతురు, పారిశుద్ధ్యం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కార్యచరణ రూపొందించాలని తెలిపారు. భక్తుల సంరక్షణ దిశగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో పుష్కర స్నానాల ప్రాంతాలలో గజా ఈతగాళ్లను ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉండాలని, పుష్కరాల నిర్వహణ కొరకు నోడల్ అధికారులను నియమించడం జరుగుతుందని తెలిపారు.కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు అంచనాలకు మించి భక్తులు వచ్చే అవకాశం ఉందని, కార్యచరణ రూపొందించడంలో జాగ్రత్తలు వహించాలని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యచరణ రూపొందించాలని, పుష్కరాల సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తదనగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.పుష్కర ఘాట్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: