ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం అమలుపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై నిజమైన ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు గత బీఆర్ఎస్ హయాంలో పేరుకుపోయినవేనని, కేసీఆర్ పాలనలో బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి విషం అందరికి తెలిసిన బిజెపి వాళ్లు ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. వచ్చిన అనతి కాలంలోనే రాష్ట్రంలో ఏ మేర పనులు చేసామో ప్రజానీకానికి తెలిసిన అన్నారు.
Admin
E Nivas News