Thursday, 30 July 2026 04:15:56 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఎన్నికలు పగడ్బందిగా నిర్వహించాలి...! పోలింగ్ నిర్వహణకు పూర్తి స్థాయి ఏర్పాట్లు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

Date : 10 February 2026 09:03 PM Views : 150

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2వ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్ నిర్వహణ కొరకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో కమిషనర్ అన్వేష్ తో కలిసి ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రాలను సందర్శించి సామాగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని 1 మున్సిపల్ కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలలో ఈ నెల 11వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని చెన్నూర్ పట్టణంలో గల అటవీశాఖ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని సూపర్ బజార్ ఏరియాలో గల ఆర్.కె.సి.ఓ.ఎ. క్లబ్ లో సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టి, సామాగ్రిని, సిబ్బందిని సురక్షితంగా కేటాయించిన ప్రకారం పోలింగ్ కేంద్రాలకు తరలించాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడం జరిగిందని, ఈసారి ఎన్నికల నిర్వహణలో పోలీసు శాఖతో పాటు అటవీ, ఆబ్కారీ శాఖ సిబ్బంది సమన్వయం చేసుకొని ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :